యస్.పి.బాలసుబ్రమణ్యం స్వర రాగ తరంగిణి
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
భద్రాచలం పట్టణంలో లో రాజ వీధి నందు గల శ్రీ జీయర్ మఠం నందు పద్మవిభూషణ్ స్వర్గీయ. యస్.పి. బాలు వర్ధంతి సందర్బంగా భద్రాచలం నందు భద్రాద్రి మెలోడీ సింగర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో స్వర రాగ తరంగిణి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమం లో భద్రాద్రి మెలోడీ సింగర్స్ గ్రూప్ నందు ఉన్న 30 మంది గాయకులు బాలు మధుర గీతాలు ఆలపించి వారికి స్వర నివాళి ఘనంగా అర్పించుకున్నారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం ప్రముఖులు ,పాకాల దుర్గా ప్రసాద్, లయన్. ఢా:గోళ్ళ భూపతి రావు, చిట్టె లలిత,భూషణ్ రావు,సోంపాక సీత, తిరుమల రావు,నిర్వాహకులు జె.ఆర్. మూర్తి కె.నాగమణి,జె.నాగలక్ష్మి ,గాయనీ గాయకులు దుర్గా ప్రసాద్,నాగమణి, కమ్మ వాణి,శివబాబు,వెంకటా చలం, నెమ్మికంటి రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సాకేతపురి వర్తక సంఘం వారు భోజనాలు ఏర్పాటు చేయడమైనది.
జె.ఆర్. మూర్తి, అధ్యక్షులు, భద్రాద్రి మెలోడీ సింగర్స్, భద్రాచలం.