18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.. తాసిల్దార్ ఎం వెంకన్న
ప్రజా గొంతుక/// జనగామ జిల్లా
నర్మేట మండలం స్థానిక బొమ్మకూరు గ్రామంలో నర్మెట్ట మండల తహసిల్దార్ ఎం వెంకన్న మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారానే సరియైన నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని మరియు సెప్టెంబర్ 19వ తారీకు వరకు చివరి తేదీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని,
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక కరోబార్ మంజ నాయక్ మరియు ఆర్ ఐ సాయిబాబా పాల్గొన్నారు.